Pages

Subscribe:

Friday 21 February 2014

జయ జయ సంతోష జనని

మా నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మగారు రచించిన సంతోషిమాత స్తోత్రము:


నమ: శ్రీ సంతోషిమాత్రే
జయ జయ సంతోషజనని...జయ శ్రీ సంతోషజనని
1. మణిగణచిత భర్మోన్నతసింహాసనసమాసీన
కనత్కనకకంకణ కేయూరముఖాభరణాంచిత
పీనపీవరాయత సద్బాహుచతుష్టయ శోభిత.....జయ జయ..
2. ఖడ్గ శూల సుధాపాత్ర అభయ హస్త సంశోభిని
సరసిజ సమ పదద్వంద్వ శోభితోరు యుగళే జనని,
గళవిలంబి సుమమాలే ముక్తామణి విభూషితే.....జయ జయ..
3. శుక్రవారసంప్రీతే నతజనశుభఫలదాయిని
భక్తియుక్తనతజనకృతపూజాసంతుష్టహృదయే
సక్తసాధుపాలనరతభుక్తిముక్తిసంధాయిని....జయ జయ..
4. కలిపీడిత జనతారణకారిణివైయవనివెలసి
తలచినమాత్రనసులలితమతికరుణించెడిజనని....జయ జయ..
శ్లోకములు:
(1) భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాం కరుణామయీం
ఆరాధకజనాభీష్ట ఫలదాం సంతోషిమాతరం.

(2) చింతితేష్ట ప్రదానేయ సురకల్పలతోపమా
వందే తాం దేవతామాద్యాం భక్త్యా సంతోషిమాతరం.

0 comments:

Post a Comment